వృద్ధ కీచకుడ్ని కాల్చి పారేసింది..

  0
  203

  తాత వయసున్న గ్రామ పెద్ద లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో, 20ఏళ్ల ఓ యువతి అతడిని కాల్చి పారేసింది. మహిళా గ్రామ సర్పంచ్ భర్త అయిన రామేశ్వర్ అనే ఆ వ్యక్తి తరచూ వాళ్ల ఇంటికి వెళ్లి వేధించేవాడు. ఆ యువతినే కాకుండా, యువతి చెల్లెల్ని కూడా లైంగికంగా వేధించేందుకు ప్రయత్నం చేశాడు. గ్రామ పెద్ద కదా, ఇంటికి వస్తున్నాడని ఆ యువతి తల్లి గౌరవంగానే మాట్లాడేది. ఏదో ఒక వంక పెట్టుకుని, వారి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు పొలంలో పనికి పోయిన సమయంలో తనకు లొంగిపోవాల్సిందిగా బెదిరించేవాడు. లేకపోతే మీ నాన్నని చంపేస్తానంటూ బెదిరించేవాడు. గతంలో కూడా ఇతడిపై రెండు హత్యకేసులున్నాయి. దీంతో భయపడుతూ వచ్చిన యువతి, చివరకు తనతోపాటు తన చెల్లెలిపై కూడా లైంగిక వేధింపులకు ప్రయత్నిస్తుండటంతో సహించలేకపోయింది. ఈ విషయం తల్లికి చెప్పింది.

  దీంతో తల్లి గ్రామ పెద్ద రామేశ్వర్ ఇంటికెళ్లి తనకు, కూతుళ్లకు సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు తమ ఇంటికి రావాలని కోరింది. ఇంటికెళ్లిన గ్రామ పెద్ద తల్లితో మాట్లాడుతుండగానే ఆ యువతి తుపాకితో కాల్చింది. తన స్నేహితుడితో కలసి మోటర్ సైకిల్ పై వెళ్లిపోయింది. తుపాకిని ఆమె స్నేహితుడే ఇచ్చాడని తేలింది. తుపాకి తూటాకు గ్రామ పెద్ద చనిపోయాడు. పోలీసులు ఆ యువతిని, స్నేహితుడ్ని, ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని కనౌజ్ సమీపంలోని ఫరూకాబాద్ లో ఈ సంఘటన జరిగింది.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..