ఇప్పటి వరకూ జియో ఫీచర్ ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు జియో స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. వినాయక చవితి పండగ ఆఫర్ గా వీటిని లాంఛ్ చేయబోతున్నారు రిలయన్స్ అధినేతలు. 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్ ఫోన్ ను ప్రకటించారు ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.5వేలు లోపు ఉంటుందని అంచనా.
గతంలో జియోఫోన్, జియోఫోన్ 2 అనే రెండు ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసిన జియో.. తొలిసారి పూర్తి ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ వచ్చే వినాయక చవితి అంటే సెప్టెంబర్ 10 నుంచి మార్కెట్‌లోకి రానుందని అంబానీ వెల్లడించారు. వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గానే జరిగిన ఏజీఎంలో ముకేశ్ ఈ ఫోన్ గురించి ప్రస్తావించారు.
Welcome to the 44th Annual General Meeting of Reliance Industries Limited. https://t.co/saBp7kERnS
— Reliance Jio (@reliancejio) June 24, 2021
గూగుల్, జియో టీమ్స్ కలిసి నిజంగానే ఓ బ్రేక్‌త్రూ స్మార్ట్‌ఫోన్ అయిన జియోఫోన్ నెక్ట్స్ ను డెవలప్ చేశాయి అని అంబానీ చెప్పారు. గూగుల్, జియో అందించే అన్ని అప్లికేషన్లను ఇది సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఈ ఫోన్ కోసం ఆప్టిమైజ్ చేసిన ఓ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ వెర్షన్‌ను తమ టీమ్ తయారు చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ఇది కేవలం ఇండియన్ యూజర్ల కోసం అందులోనూ తొలిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారి కోసం రూపొందించినట్లు పిచాయ్ తెలిపారు.