భార్యఅంటే పిచ్చి ప్రేమ.. కానీ మోసం చేసింది..

  0
  9314

  భార్య అంటే ఆ యువకుడికి పిచ్చి ప్రేమ. పెళ్లైన వెంటనే భార్య పేరు(కృష్ణవేణి)ని చేతిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. రోజులు గడిచాయి. భార్యతో గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలను అడ్డు పెట్టుకుని అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. పోలీస్ కేసులు పెట్టుకున్నారు. చివరకు కాపురం చెడిపోయింది. దీంతో వెంకటేశ్వరరావు అనే ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు ఆ యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.

  అవ్వా, అవ్వా అంటూ వెంకటేశ్వరరావు తన బాధలు చెప్పుకున్నాడు. తనకు బతకాలని ఉందని, అయితే బతకలేనని అందుకే చనిపోతున్నానంటూ చెప్పుకున్నాడు. తన చేతిపై ఉన్న భార్య పేరు తొలగించిన తర్వాతే తనకు దహన సంస్కారాలు చేయాలని సూచించాడు. తన శవాన్ని చూసేందుకు సైతం భార్యను అనుమతించొద్దని చెప్పాడు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన మెకానిక్ వెంకటేశ్వరరావు తాను భార్య కారణంగానే చనిపోతున్నానని చెప్పాడు. తన శరీరం వేడిని తట్టుకోలేదని, తన శవాన్ని కాల్చకుండా, పూడ్చేయాలని ఏడుస్తూ చెప్పాడు. ఆ తర్వాత ఉరేసుకున్నాడు.

  ఇవీ చదవండి

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.