ఇది చూస్తే మీరు శాకాహారులుగా మారడం ఖాయం..

    0
    204

    శాకాహారం, మాంసాహారం.. మనిషి ఆరోగ్యానికి ఏది మంచిది అని ఎవరైనా అడిగితే.. సరైన సమాధానం ఎవరూ చెప్పలేరు. వైద్య నిపుణులు కూడా ఏదో ఒకదానికే పరిమితం కావాలని చెప్పరు. కానీ మాంసాహారంతో పోల్చి చూస్తే శాకాహారం వందరెట్లు మేలు అని చెబుతున్నారు కొంతమంది ఆరోగ్య నిపుణులు. అక్టోబర్ 1 ప్రపంచ శాకాహారుల దినోత్సవంగా జరుపుకుంటారు కూడా.

    రోగనిరోధక శక్తి పెరుగుదల
    శాకాహారిగా మారడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. వయసుతో పాటు వచ్చే వ్యాధులకు దూరంగా ఉంటారు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. గ్యాస్‌ సమస్యలు, బరువు పెరగడం వంటివి ఉండవు.

    శాకాహారులు ఎక్కువకాలం బతుకుతారు
    శాకాహారం తీసుకుంటే సుదీర్ఘ మైన జీవితాన్ని గడపవచ్చు. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రిషన్ జర్నల్‌ కథనం ప్రకారం.. శాకాహారుల కంటే మాంసాహారులలో వృద్ధాప్య ఛాయలు తొందరగా కనిపిస్తాయట. అంతేకాదు మాంసాహారులకే వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

    బరువు నియంత్రణ
    శాకాహారం బరువు సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొవ్వు నిల్వ ఉండకుండా చూసుకుంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

    గుండె సమస్యలు దూరం
    శాకాహార ఆహారం స్ట్రోక్ వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు లివర్‌ చెడిపోకుండా కాపాడుతుంది.

    శాకాహారంలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలం..
    శాకాహారంతో కూడా మాంసాహారంలో దొరికే విటమిన్లు, ప్రొటీన్లను తీసుకోవచ్చు. అంతేకాదు మాంసాహారం వల్ల చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది. కానీ మొక్కల తిండి తింటే ఈ సమస్య ఉండదు. అంతేకాదు నిత్య యవ్యనంగా ఉండవచ్చు.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.