‘ఈబీసీ నేస్తం’కు ఇలా అప్లై చేసుకోండి..

    0
    865

    అగ్రవర్ణాల్లోని పేద మహిళలకోసం ఏపీ ప్రభుత్వం ఈబీసీ నేస్తం అనే పథకాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ పథకం వివరాలు, అర్హతలు మీకోసం..

    ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. అగ్రవర్ణ పేద మహిళలకోసం ఈ పథకం తెచ్చారు. కాపునేస్తం అందుకునేవారు దీనికి అనర్హులు. మిగతా ఓసీ కులాల్లో ని 45-60 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలుఅర్హులు.

    ఈ పథకం జీవో విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచటం కోసం ఆర్థిక సాయం అందించటం ముఖ్యఉద్దేశ్యం. లబ్ధిదారులకు ఆర్థిక సాయంగా ఏడాదికి 15000/- చెప్పున మూడు సంవత్సరాలుకు 45000/- రూపాయలు అందించనున్నారు. దీనికోసం 2021-22 బడ్జెట్ కింద ప్రభుత్వం సంవత్సరానికి 670-605 కోట్లు అలా మూడు సంవత్సరాలు కు 1810-2011 కోట్లు కేటాయించింది.

    అర్హతలు:
    వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో ఉన్న లబ్దిదారుతో పాటు ఎస్సీ , ఎస్టీ , బిసి మైనారిటీ మహిళలు అర్హులు కారు. కేవలం ఈబిసి మహిళలు మాత్రమే అర్హులు. అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్కు ఉండాలి. ఇక వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ. 10వేలు, పట్టణాలలో అయితే నెలకు రూ.12వేలు పరిమితిని మించకూడదు. ఆ పథకంలో లబ్ధిదారులకు పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా పల్లపు భూమి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని పెన్షనర్ గాని ఉండకూడదు. అయితే ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. సెప్టెంబర్ 29వ తేదీ 2021 నాటికి 45 సం.లు కంటే ఎక్కువ.. 60 సం.లు లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఈనెల 7వ తేదీలోపు సమీప గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.