ఖాళీ సిరంజితో టీకా.. ఇదో కొత్త మోసం..

    0
    217

    కొవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవండి. ఇటీవల కాలంలో కొవిట్ టీకాల పేరుతో ఉత్తిత్తి టీకాలు వేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వీటికి ఎక్కడా సరైన ఆధారాలు లేవు. డబ్బులకు కక్కుర్తిపడే కొంతమంది వైద్య సిబ్బంది ఇలా ఖాళీ సిరంజిలతో టీకాలు ఇచ్చి, వాటిని లెక్కల్లో చూపిస్తారు. మిగిలిపోయిన టీకాలను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు. ఇలాంటి ఘటనలు చాలా చోట్ల జరిగినా ఆధారాల లేకపోవడం విశేషం. తాజాగా ఓ నర్సు ఇలాంటి పని చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. బీహార్ లోని చాప్రాలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో ఓ నర్సు ఇలా ఖాళీ సిరంజితో టీకా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయ్యింది. ప్లాస్టిక్ క‌వ‌ర్‌ నుంచి కొత్త సిరంజీ తీసిన న‌ర్సు.. నేరుగా ఓ వ్య‌క్తికి వ్యాక్సిన్ ఇచ్చింది. అయితే ఆ ప్ర‌క్రియ అంతా మొబైల్ ఫోన్‌ లో షూట్ చేయ‌డంతో ఆమె దొరికిపోయింది. ఫ్రెండ్ తీసిన వీడియో గురించి తెలుసుకున్న తర్వాతే తాను ఖాళీ సిరంజీ టీకా తీసుకున్న‌ట్లు గుర్తించాని ఆ వ్య‌క్తి చెప్పాడు. అయితే ఖాళీ టీకా తీసుకుకోవ‌డం వ‌ల్ల త‌న‌కు త‌ల నొప్పి వ‌చ్చిన‌ట్లు అత‌ను చెప్పాడు. మ‌రో టీకా తీసుకోలేద‌న్నాడు. నిజానికి టీకా తీసుకుంటే ఫ్రెండ్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో తెలుసుకోవాల‌న్న ఉద్దేశంతో మ‌రో వ్య‌క్తి వీడియా తీశాడు. కానీ ఆ వీడియోను మ‌ళ్లీ చూసిన‌ప్పుడు త‌న‌కు డౌట్ వ‌చ్చింద‌ని, ప్లాస్టిక్ క‌వ‌ర్ నుంచి నేరుగా ఆ న‌ర్సు సిరంజీ తీసి త‌న ఫ్రెండ్‌కు ఇచ్చిన‌ట్లు వీడియో తీసిన వ్య‌క్తి చెప్పాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆ నర్సుని తొలగించారు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..