మెగా స‌పోర్ట్ ప్ర‌కాష్ రాజ్‌కే.. నాగ‌బాబు

  0
  119

  సెప్టెంబ‌ర్ లో జ‌ర‌గ‌బోయే మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించేలా ఉన్నాయి. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే మా ఎన్నిక‌లు ఇంకా ర‌స‌వ‌త్తంగా జ‌ర‌గ‌నున్నాయి. అందుకు కార‌ణం హేమాహేమీలు రంగంలోకి దిగ‌డ‌మే. ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజ‌శేఖర్ తో పాటు న‌టి హేమ కూడా మా అధ్య‌క్ష పీఠం కోసం బ‌రిలోకి దిగుతున్నారు. మా ఎన్నిక‌ల్లో చ‌తుర్ముఖ పోటీ త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

  ఈ నేప‌ధ్యంలో మెగా ఫ్యామిలీ స‌పోర్టు త‌న‌కే ఉందంటూ ప్ర‌కాష్ రాజ్ మీడియా ముఖంగా రెండు రోజుల క్రితం ప్ర‌క‌టించారు. దాన్ని నిజం చేస్తూ మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఈరోజు జ‌రిగిన ప్రెస్ మీట్లో తాము ప్ర‌కాష్ రాజ్ కి ఫుల్ స‌పోర్ట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్న‌య్య చిరంజీవి మ‌ద్ద‌తు ప్ర‌కాష్ రాజ్ కోరార‌ని, ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఇచ్చిన మాట కోసం ప్ర‌కాష్ రాజ్ కే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్ రాజ్ గురించి నాగ‌బాబు ఇలా చెప్పుకొచ్చారు.
  ‘ప్ర‌కాశ్ రాజ్ కు ప్ర‌తి భాష‌తో ట‌చ్ ఉంది. ఎవ‌రితోనైనా స‌రే వారి భాష‌లో మాట్లాడ‌గ‌లిగే స‌త్తా ఉన్న వ్య‌క్తి. ఎవ‌రితో అయినా స‌రే ఏ ప‌ని అయినా స‌రే చేయించుకోగ‌లిగే వ్య‌క్తి. అంతేకాదు, ప్ర‌కాశ్ రాజ్ నాలుగైదు ఏళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు’ మూడు-నాలుగు గ్రామాలు ద‌త్త‌త తీసుకుని సేవ‌లు అందిస్తున్నారు.

  చాలా మందికి ఇళ్లు క‌ట్టించారు. చాలా మందికి సాయం చేశారు. లోకల్, నాన్ లోక‌ల్ అంటూ కొంత‌మంది వాదిస్తున్నారు. అలా వాదించ‌డం అర్థ‌ర‌హితం. ఎందుకంటే మా అసోసియేష‌న్‌లో స‌భ్యత్వం తీసుకున్న ప్ర‌తి వ్య‌క్తికి మా అధ్య‌క్ష ప‌దవి నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబ‌ర్ దాకా పోటీ చేసే అవ‌కాశం ఉంటుంది. అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి గొప్ప న‌టుడు త‌న‌ను బాలీవుడ్ న‌టుడు అని అన‌కూడ‌ద‌ని, భార‌తీయ న‌టుడు అనాల‌ని అన్నారు. ప్ర‌కాశ్ రాజ్ కూడా ఎక్క‌డ పుట్టాడు.. ఎక్క‌డ పెరిగాడు అన్న విష‌యం అన‌వ‌స‌రం’ అన్నారు నాగ‌బాబు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..