కాఫీ పౌడర్ తో ఫేస్ ప్యాక్.. ఎన్ని లాభాలో..?

    0
    160

    మనం నిత్యం ఇంట్లో వాడుకునే పదార్థాలతో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకుని వేసుకుంటే చాలా లాభాలుంటాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పదార్థాలే కాదు, అప్పుడప్పుడు కాఫీ పౌడర్ లాంటి వాటిని కూడా ట్రై చేస్తుండాలి.

    ఎలా తయారు చేయాలి..?
    కాఫీ పౌడర్ మిశ్రమాన్ని కొద్దిగా నీటితో కానీ తేనెతో కలిపి రోజూ ఉదయాన్నే ఒక లేయర్ లా పూసుకోవాలి. 10నిముషాలపాటు ఆరబెట్టుకుని ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత కొన్ని గంటలపాటు సబ్బు రాసుకోకూడదు. కాఫీ పొడిని కడిగేసుకునేటప్పుడు స్క్రబ్బర్ లాగా రుద్దుకోవాలి.

    ఉపయోగాలేంటి..?

    కొంతమంది రాత్రిపూట సరిగా నిద్ర పోక పోవడంవల్ల మరియు ఎక్కువ సమయం కంప్యూటర్ ,సెల్ ఫోన్లు వాడడం వల్ల కళ్ళ కింద నల్లటి ఆకృతులు వస్తూ ఉంటాయి. కాఫీ పొడి ఫేస్ ప్యాక్ తో కొద్ది రోజులకు ఆ నల్లటి వలయాలు తగ్గిపోతాయి. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ కాబట్టి కాఫీ పొడి ,తేనె కలిపి ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగించుకోవడం వల్ల మీ ముఖం చాలా నిగారింపుగా కనిపిస్తుంది.

    కొంతమందికి ఎండాకాలం పూట ముఖం ఎర్రగా మారుతుంది. అలా ఎర్రగా మారిన చోట కాఫీ పౌడర్ మిశ్రమాన్ని రాయడం వల్ల అవి తగ్గి పోతాయి. ముఖం మీద ఏర్పడిన మొటిమలను కూడా తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. ముఖంపై ఏర్పడే డార్క్ సర్కిల్స్ ను కూడా ఇది తగ్గిస్తుంది. ఇలా కాఫీ పౌడర్ తో చేసిన ఫేస్ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు రోజులు వాడడం వల్ల ముఖంపై ఉండే చర్మ సమస్యలు తొలగిపోతాయి

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.