మమ్మల్ని కాల్చొద్దు.. అరెస్ట్ చేయండి..

  0
  21001

  ఆవుల్ని దొంగతనం చేసిన దొంగలు ప్రాణ భయంతో నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మమ్మల్ని కాల్చొద్దు, అరెస్ట్ చేయండి అంటూ చేతులెత్తి దండం పెట్టి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఉత్తర ప్రదేశ్ లోని భాగ్ పట్ లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల ఆవుల్ని దొంగతనం చేస్తున్న ఓ ముఠాకోసం పోలీసులు గాలిస్తున్నారు. వరుస సంఘటనలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిలో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఇద్దరు మాత్రం తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిద్దర్నీ దొరికితే కాల్చేస్తారనే ప్రచారం మొదలైంది. దీంతో ఆ ఇద్దరు నేరుగా దోఘట్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. అంద దూరం నుంచి చేతులు పైకెత్తుకుని వచ్చి మేం లొంగిపోతున్నాం, కాల్చొద్దు అంటూ ప్రాధేయపడ్డారు. చివరకు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..