భర్త ఘోరాన్ని స్మార్ట్ వాచ్ పట్టించేసింది..

  0
  47358

  20ఏళ్ల వివాహిత ఎలా చనిపోయిందో పోలీసు విచారణలో తేలలేదు. అయితే ఆమె చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ మాత్రం ఆమె ఎలా చనిపోయిందో చెప్పేసింది. ఇప్పుడు పోలీసుల విచారణలో ఇదో కీలక విషయంగా మారింది. మొబైల్ ఫోన్ లు, సీసీ కెమెరాలే కాదు, స్మార్ట్ వాచ్ లు కూడా చనిపోయిన విధానాన్ని చెబుతాయని అర్థమైపోయింది. క్రౌచ్ అనే 20ఏళ్ల వివాహిత చనిపోయింది. ఆమె సాధారణంగానే చనిపోయిందని భావించి అంత్యక్రియలు చేశారు. అయితే ఆమె స్మార్ట్ వాచ్ ని పరిశీలించినప్పుడు ఆమెను నిద్రలో ఉండగానే భర్త చంపేశాడని, ఒక నిర్థారణకు వచ్చారు. ఇద్దరి మధ్య గొడవ సందర్భంగా ఆమె చనిపోయిందని భర్త చెప్పిన మాటలు అబద్ధాలని పోలీసులకు తెలిసింది.

  ఆమె చనిపోయిన సమయం వేకువ జాము 4 గంటల 5నిముషాలు. ఆ సమయంలో స్మార్ట్ వాచ్ డేటా ప్రకారం ఆమె ఎక్కడికీ కదల్లేదు. ఆమె ఎన్ని స్టెప్స్ నడిచిందన్న విషయమూ లేదు. అప్పుడు రికార్డ్ అయిన హార్ట్ బీట్, ఇవన్నీ కూడా ఆమె నిద్రపోతున్నట్టే నిర్థారించాయి. నిద్రపోతున్నప్పుడే దిండుతో ఊపిరాడకుండా చేసి భర్త బబీస్ ఆమెను చంపేశాడని తేలిపోయింది. పోలీసులు స్మార్ట్ వాచ్ డేటాను భర్తకు చూపించినప్పుడు మారు మాట్లాడకుండా తానే ఆమె మొహంపై దిండ్లు పెట్టి అదిమి చంపేశానని ఒప్పుకున్నాడు. ఆమె డైరీని పరిశీలించిన అధికారులకు కూడా ఇద్దరి మధ్య వివాదాలు అర్థమయ్యాయి. భర్తనుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు ఆమె డైరీలో రాసుకుంది. బహుశా ఇందుకోసమే భర్త ఆమెను చంపేసి ఉంటాడని పోలీసులు భావించారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..