కరోనాను 43సార్లు కాలితో తన్నాడు..

    0
    592

    కరోనానుంచి కోలుకున్నవారిని కరోనా విజేతలంటాం, ఒకటికి రెండుసార్లు కూడా కరోనాబారినపడి బతికి బట్టకట్టినవారిని కూడా చూశాం. కానీ ఇతను అలాంటిలాంటి వ్యక్తి కాదు. ఏకంగా కరోనాని 43ఏళ్లు జయించాడు. చావు అంచుల వరకు వెళ్లి తిరిగి బతికాడు. అతనేమీ యువకుడు కాదు. 72ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి పేరు డేవ్ స్మిత్. ఇంగ్లండ్ లోని బ్రిస్టల్ ప్రాంతానికి చెందిన డేవ్ డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యాడు. గతేడాది మార్చిలో ఇతనికి కరోనా సోకింది. ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నాడు. ఎంతవరకూ తగ్గకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వతా కోలుకుని ఇంటికొచ్చాడు. మళ్లీ కరోనా లక్షణాలు కనపడి అనారోగ్యం తీవ్రతరం కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. ఇలా అతనికి 43సార్లు కరోనా పాజిటివ్ గా తేలింది.

    10నెలల కాలంలో ఏడుసార్లు ఆస్పత్రిలో చేరాడు డేవ్ స్మిత్. 5 సార్లు అంత్యక్రియలకి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. బంధువులంతా వచ్చి ఆయనను చివరి చూపు చూసుకునేవారు. అంతలోనే తిరిగి లేచి కూర్చునేవాడు డేవ్ స్మిత్. ఇతనికోసం రెజినెరన్ అనే కంపెనీ యాంటీబాడీ కాక్ టైల్ తయారు చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి కూడా దీనితోనే ట్రీట్ మెంట్ చేశారు.

    ఇవీ చదవండి..

    లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

    వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

    అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

    కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..