శ్రీవారి భక్తులకు శుభవార్త.. రోజుకి 8వేల ఉచిత దర్శన టోకెన్లు..

  0
  246

  కరోనా కారణంగా ఆంక్షలతో తిరుమల శ్రీవారి దర్శనానికి దూరమైన సామాన్య భక్తులకు ఇది నిజంగా శుభవార్తే. ఇటీవలే సర్వదర్శనం కోటాను విడుదల చేసిన టీటీడీ.. ఇప్పుడు ఆ కోటాను భారీగా పెంచింది. అంతే కాదు, చిత్తూరు జిల్లా వాసులకే సర్వదర్శనం అనే రూల్ ని కూడా తీసేసింది. ఇప్పటి వరకూ కేవలం చిత్తూరు జిల్లా వాసులకే రోజుకి 2వేల సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఇకపై ఆ సంఖ్యను 8వేలకు పెంచారు. అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పించారు. పెరటాసి నెల కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి అనూహ్యంగా డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ కార్డు కలిగి ఉన్న ప్రతి భక్తుడు సర్వదర్శనం టోకెను పొందే అవకాశం కల్పించారు. ఏ రోజుకు సంబంధించిన టోకెన్లు ఆరోజు తెల్లవారుజాము నుంచి శ్రీనివాసం భవనంలో జారీ చేస్తామని అధికారులు తెలిపారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.