సమాదుల్లో బంగారంపై ఇక తాలిబన్ల పోరు..

    0
    385

    అఫ్గానిస్తాన్ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో తాలిబన్ల ప్ర‌భుత్వం డబ్బులు క‌ట‌క‌ట‌లాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘బ్యాక్ట్రియన్‌ ట్రెజరీ’ అనే అంశం తెర‌పైకి వ‌చ్చింది. అత్యంత పురాతన నిధినిక్షేపాల‌ను ‘బ్యాక్ట్రియన్‌ ట్రెజరీ’ పేరుతో పిలుస్తారు.

    విష‌యాన్ని ఆఫ్గానిస్తాన్ మంత్రి అహ్మ‌దుల్లా వాసిక్ తాజాగా ప్ర‌స్తావించారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల క్రితం ఉత్త‌ర అఫ్గాన్‌లోని షేర్ బ‌ర్గ‌న్ ప్రాంతంలో ఉన్న‌ అంతులేని నిధినిక్షేపాల‌ను ఇత‌ర దేశాలు త‌ర‌లించుకుపోయాయి

    40 ఏళ్ళ క్రితం షేర్ బ‌ర్గ‌న్ ప్రాంతంలో పూడ్చిపెట్టిన 6 స‌మాధుల‌ను త‌వ్వారు. అప్పుడే ఈ ఖ‌జానా బ‌య‌ట‌ప‌డింది. అస్థిపంజరాల మీద క‌ప్ప‌బ‌డి ఉన్న ఈ పురాత‌న నిక్షేపాల విలువ, ఇప్ప‌టి క‌రెన్సీ ప్ర‌కారం 20 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఎంతో విలువైన వ‌జ్ర‌వైఢూర్యాలు, మ‌ర‌క‌త మాణిక్యాలు, బంగారు ఆభ‌ర‌ణాలు ఆ అస్థిపంజ‌రాల‌పై ఉన్నాయ‌ట‌

    కొన్ని శ‌తాబ్దాల క్రితం అప్ప‌టి రాజులు, రాణులు వాడిన వ‌స్తువ‌ల ఖ‌జానానే ఇది. అప్ప‌ట్లో వారు వాడిన వ‌స్తువులు… అంటే క‌త్తులు, క‌వ‌చాలు, దుస్తులు పాత్ర‌లు, వ‌స్తువులు.. ఇలాంటివి సుమారు 20వేల‌కు పైగా ఉన్నాయ‌ట‌. వారు వాడిన చెప్పుల కింద వినియోగించే సోల్ కూడా బంగారంతోనే ఉన్నాయంటే… అప్ప‌ట్లో బంగారం ఎంత విరివిగా వినియోగించేవారో అర్ధం చేసుకోవ‌చ్చు.

    అంత‌టి విలువైన‌ ‘బ్యాక్ట్రియన్‌ ట్రెజరీ’ కొన్ని దేశాలు ఆఫ్గాన్ నుంచి త‌ర‌లించుకుపోయాయి. ఆ యా దేశాల్లోని మ్యూజియంల‌లో భ‌ద్ర‌ప‌రిచాయి. అయితే ఇప్పుడు తాలిబ‌న్ల ఆధీనంలో ఉన్న ఆఫ్గానిస్తాన్ తీవ్ర ఆర్ధికసంక్షోభంలో ఉండ‌డంతో… ఆ దేశ‌పు సాంస్కృతిక మంత్రి అహ్మ‌దుల్లా వాసిక్… ‘బ్యాక్ట్రియన్‌ ట్రెజరీ’ అంశాన్ని తెర‌పైకి తెచ్చారు

    త‌మ దేశం నుంచి త‌ర‌లించుకుపోయిన ఖ‌జానాను తిరిగి త‌మ‌కు అప్ప‌గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాము ఈ గ‌డ్డు ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే, అదొక్క‌టే మార్గ‌మని అంటున్నాడు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.