చెట్లు నరకడమెందుకు..? ఇలా చేయొచ్చుగా..

  0
  25

  కొత్తగా ఏవైనా నిర్మాణాలకు అడ్డుగా చెట్లు ఉంటే.. వాటిని వెంటనే తెగనరికేస్తుంటారు కొంతమంది. మరికొందరు మాత్రం, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తుంటారు. అలాంటి ఆలోచనలనుంచి పుట్టిందే ట్రీ లిఫ్టింగ్. ఆధునిక నిర్మాణాలకోసం పురాతన చెట్లను తొలగించకుండా, వాటిని జాగ్రత్తగా కాపాడేదే ట్రీ లిఫ్టింగ్. చెట్టు చనిపోదు, అలాగని దాని వల్ల మన నిర్మాణాలకు ఆటంకం ఉండదు. వేరే ప్రదేశంలో దాన్ని జాగ్రత్తగా తిరిగి నాటేస్తారు.
  మొక్కలు నాటడం గురించి మనం వింటూనే ఉంటాం. ఇది కొత్తగా చెట్లు నాటే ప్రక్రియ. ప్రాణం లేని వస్తువుల్ని ఒకచోటనుంచి ఇంకోచోటకు తరలించినా నష్టంలేదు కానీ, ప్రాణం ఉన్న చెట్టుని ఇలా కూకటి వేళ్లతో సహా పెకలిస్తే ఎలా..? ట్రీ లిఫ్టింగ్ లో ఇలా తొలగించే చెట్లను మరిన్ని జాగ్రత్తలు తీసుకుని తిరిగి నాటుతుంటారు. సేంద్రియ, రసాయన ఎరువులు ఉపయోగించి చెట్టు చనిపోకుండా చూస్తారు. అదే సమయంలో త్వరగా కోలుకుని చిగురు వేయడానికి, వేర్లు భూమిలో నాటుకు పోయేందుకు కూడా మందులిస్తారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..