మినీ స్కర్ట్ ల్లో మగ టీచర్లు..

  0
  105

  స్పెయిన్ ఉపాధ్యాయులు ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలు పెట్టారు. ఓ విద్యార్థికి మద్దతుగా వారు స్కూల్ కి స్కర్ట్ లు వేసుకుని వస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. స్పెయిన్ లోని ఓ స్కూల్ యాజమాన్యం పిల్లల డ్రస్ ల విషయంలో బాగాస్ట్రిక్ట్ గా ఉండేది. రెండేళ్ల క్రితం ఓ విద్యార్థి స్కర్ట్ వేసుకుని స్కూల్ కి వచ్చాడు. దీంతో మేనేజ్ మెంట్ ఆ అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించేసింది. అంతే కాదు, ప్రింటెడ్ టీ షర్ట్ లు వేసుకున్నా కూడా యాజమాన్యం ఒప్పుకునేది కాదట. దీంతో ఆ అబ్బాయికి మద్దతుగా ఇద్దరు ఉపాధ్యాయులు కూడా స్కర్ట్ లు వేసుకుని స్కూల్ కి వచ్చి తమ నిరసన తెలియజేశారు. అలా అలా అదో పెద్ద ఉద్యమం అయిపోయింది. రెండేళ్లలో దేశం మొత్తం మగ టీచర్లు ఇలా స్కర్ట్ ల ఉద్యమానికి మద్దతు తెలిపారు. దాదాపు దేశంలోని 80శాతం స్కూల్స్ లో మగ టీచర్లు వారంలో ఓ రోజు స్కర్ట్ లు వేసుకుని స్కూల్ కి వచ్చి పాఠాలు చెప్పి వెళ్లిపోతున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..