ఇంట్లో అలిగి ఎంత పనిచేశాడు.. ?

  0
  52

  ఇంట్లో తల్లిదండ్రులమీద అలిగిన ఓ కుర్రాడు ఆరేళ్లు ఇంటికి దూరంగా ఉండి, ఇంటర్నెట్ స్టార్ అయ్యాడు. 14ఏళ్ల వయసులో ఆండ్రస్ కాంటో అనే ఈ స్పెయిన్ యువకుడు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నాడు. ఇంటినుంచి అలిగి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత తల్లిదండ్రులమీద కోపంతో ఇంటికి తిరిగి వెళ్లలేదు. వాడికోసం వెదికి వెదికి ఎప్పుడో తిరిగొస్తాడని తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. ఈలోగా ఇంటినుంచి పారిపోయిన కాంటో, లా రోమన అలికాంటీ అనే ప్రాంతంలో ఓ విచిత్రమైన పనిచేశాడు. ఆరేళ్లపాటు సొరంగం తవ్వుతూనే ఉన్నాడు. 20ఏళ్ల వయసొచ్చేనాటికి సొరంగం చాలా వరకు తవ్వేశాడు. తానెందుకు చేస్తున్నాడో అతడికే తెలియదు. తల్లిదండ్రుమీద కోపంతోనే తానీ పనిచేస్తున్నానని ఆ తర్వాత చెప్పాడు.

  ఆరేళ్ల శ్రమ తర్వాత ఆ సొరంగంలోనే ఒక బెడ్ రూమ్, వంటగది, డ్రస్సింగ్ రూమ్, హాల్.. ఇలా అన్నిట్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచానికి దూరంగా ఈ సొరంగంలోనే బతకడం నేర్చుకున్నాడు. బయట పనిచేసుకుని, 3 గంటలు చదువుకుని ఆ తర్వాత ఖాళీ టైమ్ లో ఇలా సొరంగం తవ్వుతూనే ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఆండ్రూ అనే స్నేహితుడు, అతడికి ఓ డ్రిల్లింగ్ మిషన్ ఇచ్చాడు. దీంతో సొరంగం తవ్వడాన్ని మరింత వేగవంతం చేసి లోపల మంచి ఇల్లు కట్టేశాడు. ఇంట్లోనే వైఫై, టీవీ, ఇలాంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఉన్నఫళంగా అతనిగురించి ఇంటర్నెట్ లో టీవీల్లో వార్తలు రావడంతో తల్లిదండ్రులకు తెలిసొచ్చింది. వెంటనే వారు వెళ్లి కొడుకు సొంతంగా నిర్మించుకున్న ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. ఇంటికి తిరిగి రమ్మంటే తాను, ఈ సొరంగం గుహలోనే ఉండిపోతానని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోతానని చెప్పి పంపించేశాడు.

   

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..