ఒక్కో అమ్మాయి ధర రూ.30వేలు.. ఇదీ వ్యాపారం.

    0
    270

    ఇటీవల బంగ్లాదేశ్ అమ్మాయిపై జరిగిన దారుణ అత్యాచార ఘటన దేశాన్ని కదలించింది. ఈ ముఠాలోని సభ్యులందరూ బంగ్లాదేశీయులే. బంగ్లాదేశ్ అమ్మాయిల్ని భారత దేశానికి తీసుకొచ్చి, ఇక్కడ వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత బంగ్లాదేశ్-భారత్ సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేశారు. అయినా గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వ్యభిచారం కోసం తరలిస్తున్న అమ్మాయిలను సరిహద్దు భద్రతాదళం పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది.

    ఒక్కో యువతిని సగటున 30నుంచి 40వేలకు కొనుగోలు చేసి, పశ్చిమబెంగాల్ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒకసారి ఈ ఊబిలోకి దించేస్తే మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం కష్టంగా ఉంది. ప్రతి రోజూ 15నుంచి 20మంది అమ్మాయిలను సరిహద్దులనుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు భద్రతా దళాల పహారా ముమ్మరంగా ఉండటంతో అమ్మాయిల వ్యాపారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఫొటోలో చూపిస్తున్న ఓ అమ్మాయిని 30వేలకు, మరో ఇద్దరు అమ్మాయిలను 34వేలకు కొనుగోలు చేసి తీసుకొస్తుండగా బీఎస్ఎఫ్ జవానులు పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలించి పరీక్షలు చేయించి బంగ్లాదేశ్ పంపించేస్తున్నారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..