ఇటీవలే మంత్రి పదవినుంచి దిగిపోయిన టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో మంతనాలు జరిపిన తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన ఆయన, పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తో తనకున్న 19ఏళ్ల అనుబంధాన్ని తెంచేసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఐదేళ్ల క్రితమే నేను టార్గెట్..
ఐదేళ్ల క్రితం నుంచే తనను అవమానించడం ప్రారంభించారని చెప్పారు ఈటల. మంత్రిగా ఉన్న తనకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏం జరుగుతుందో తెలుసుకోకుండా… తన వివరణ తీసుకోకుండానే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేశారని వాపోయారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్… ఇప్పుడు డబ్బు, అణచివేతలను నమ్ముకున్నారని ఆరోపించారు.