చికెన్ లెగ్ పీస్ లో టవల్ ఎలావచ్చింది ?

  0
  322

  ఓ మహిళ తను ఆర్డర్ చేసిన లెగ్ పీస్, ఫ్రైడ్ చికెన్ ముక్కలు చూసి ఎగిరి గంతేసింది. ఆరేళ్ల కొడుకు అడిగాడని ఆన్ లైన్ లో చికెన్ ఆర్డర్ చేసింది. 40నిముషాలకల్లా డెలివరీ బాయ్ చికెన్ తీసుకొచ్చి ఇంట్లో వాలిపోయాడు. ఆమె సంతోషించింది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఓ పెద్ద లెగ్ పీస్ కనపడింది. రెస్టారెంట్ తన కొడుకుకోసం మంచి ముక్క వేసిందని సంబరపడి ప్లేట్ లో వడ్డించింది. తీరా చూడబోతే చిన్న సైజ్ టవల్ బయటపడింది. దాని చుట్టూ కార్న్ పౌడర్ కొద్దిగా చికెన్ లేయర్ కనిపించింది.

  ఒక్కసారిగా షాక్ తిని రెస్టారెంట్ కి ఫిర్యాదు చేసింది. దీంతో ఏం జరిగిందన్న విషయాన్ని పరిశీలించేందుకు రెస్టారెంట్ కూడా మూడు రోజులు మూసేసి విచారణ ప్రారంభించారు. చికెన్ ఫ్రై చేయడంలో టవల్ చుట్టూ చికెన్ ఉండిపోయింది. ఇది ఎలా సాధ్యమని రెస్టారెంట్ కి కూడా అర్థం కాలేదు. అయినా నిజాయితీగా కస్టమర్ తనకు ఫిర్యాదు చేసింది, డబ్బులు కూడా వెనక్కు అడగకపోవడంతో సీరియస్ గా దర్యాప్తు చేయాలని నిర్ణయించి సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. జొనిబి అనే ఈ మహిళ, ఇప్పుడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫిలిప్పైన్స్ లోని బొనిఫెసియో గ్లోబల్ సిటీలో ఈ సంఘటన జరిగింది. స్టోర్ లో సిబ్బంది నిర్వాకం వల్లే ఇలా జరిగిందని, కంపెనీ భావిస్తోంది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..