విమానం టైర్ రాడ్ పట్టుకొని ముగ్గురు పైకి లేచి

  0
  80

  ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన మొదలు కావడంతో ప్రజలు ఎంత భయాందోళనలకు గురవుతున్నారో తెలియజేసే సంఘటన ఇది. అమెరికా మిలట్రీ విమానం టేకాఫ్ అవుతూనే ఆ విమానం కింద చక్రాల వద్ద ఉన్న ఐరన్ రాడ్ లు పట్టుకుని ముగ్గురు విమానంతోపాటే పైకి లేచారు. అత్యంత భయానకం, భయంకరమైన సాహసం వెనక, ఏదో ఒక విధంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడాలన్న ఆతృత స్పష్టంగా కనపడుతోంది. అమెరికా విమానం సి-17 గ్లోబ్ మాస్టర్ కాబూల్ విమానాశ్రయం నుంచి పైకి లేస్తూనే ముగ్గురు వ్యక్తులు టైర్ పక్కనే రాడ్డు పట్టుకుని ఉండటం కనిపించింది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఆ ముగ్గురు కిందపడిపోయారు. అందులో ఇద్దరు చనిపోయారు. మరొకరు మాత్రం తీవ్ర గాయాలతో చావు బతుకుల్లో ఉ్నారు. ఆ ముగ్గురు కాబూల్ వాసులే.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..