జగన్ దగ్గరకు సినిమా పంచాయితీ..

  0
  88

  తెలంగాణలో సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నా, ఏపీలో మాత్రం టికెట్ రేట్ల తగ్గింపు కారణంగా థియేటర్లు అంతంతమాత్రంగానే ఓపెన్ అయ్యాయి. దీనికితోడు ఇండస్ట్రీలో ఉన్న మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం సినీ పెద్దలు సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోరారు. ఆయన అంగీకారం తెరపడంతో.. ముందుగా చిత్ర పరిశ్రమ పెద్దలు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.

  సీఎం జగన్ తో చర్చించాల్సిన అంశాలను రెడీ చేసుకున్నారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, సురేష్ బాబు, దిల్‌రాజు, వి.వి.వినాయక్‌, కొరటాల శివ, మెహర్‌ రమేశ్‌, ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు సినిమా ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపుపై ఇటీవల వచ్చిన కొత్త జీవో విషయంలో దర్శకనిర్మాతలు సంతోషంగా లేరు. దీంతో ఆ జీవో అమలుని ఆపేయాలని వారు జగన్ ని కోరే అవకాశం ఉంది. టికెట్‌ ధరలు, ఇతర సమస్యలను భేటీ సందర్భంగా సీఎం జగన్‌ కు వారు వివరిస్తారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..