ఆ ఎస్పీ ఆ విషయంలో చాలా స్పెషల్..

  0
  564

  పోలీసు స్టేషన్ కు వెళితే.. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే.. పోలీసులు ఎలా మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ మాటలు చెబుతారే తప్ప.. ఎవరూ పాటించరు. అయితే ఇలాంటి పోలీసులకు కాస్త విభిన్నంగా ఉంటాడు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్..

  సిద్ధార్ కౌశల్ ఎక్కడ పని చేసినా తన మార్క్ చూపిస్తాడు. గతంలో ఆయన ప్రకాశం జిల్లాలో పనిచేశాడు. అక్కడ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు. తానే స్వయంగా బైకుపై వెళ్లి.. పోలీసు స్టేషన్లో జరిగే విషయాలను గమనించేవాడు.. సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేవాడు.

  తాజాగా అయన కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. అయితే ఎక్కడకు వెళ్లినా ఆయన తన ప్రత్యేకత చాటుకుంటాడు. తాజాగా స్పందన కార్యక్రమంలోనూ ఈయన మార్క్ చూపించాడు. ఆయన టేబుల్ పై దయచేసి కూర్చోండి అని రాసివుండే బోర్డును పెట్టించాడు.

  సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రతీ ఒక్కరినీ కూర్చోబెట్టి మరీ.. సమస్యలను పరిష్కరిస్తున్నాడు. ఇందుకే సిద్దార్ధ్ కౌశల్ పోలీస్ డిపార్టుమెంట్ మొత్తం మీద స్పెషల్ గా కనిపిస్తాడు.. సెల్యూట్ సిద్ధార్ కౌశల్..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.