సాయిధరమ్ కోసం కదిలిన పవన్ కళ్యాణ్..సాయంత్రం అభిమానులకు పండగే..
రిపబ్లిక్ మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది. ఈ సాయంత్రం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే అభిమానులకు పాసులను కూడా పంచేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ కూడా రానున్నట్టుగా తెలుస్తోంది. రిపబ్లిక్ మూవీ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న విషయం కూడా తెలిసిందే.. అపోలో హాస్పిటల్ లో సాయి పూర్తిగా కోలుకుంటున్నట్టు ఇటీవలే చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా అభిమానులకు చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మాత్రం రాకపోవచ్చని చెబుతున్నారు. సాయి ధరమ్ తేజ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయినా.. ఓ వీడియో ద్వారా అభిమానులను పలకరించేలా మెగా టీం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి..