ఈ ఫొటో చరిత్ర తెలిస్తే ,మీ కళ్ళలో ..

  0
  472

  ఈ ఫొటో చరిత్ర తెలిస్తే .. మీ కళ్ళలో నీళ్లు రావచ్చు.. నేటి కాలంతో పోలిస్తే కోపంతో కళ్ళు ఎర్రబడవచ్చు .. నేటి రాజకీయవ్యవస్థపై అసహ్యం వేయవచ్చు.. నాటి నేతలకు , వారి త్యాగాలకు దండం పెట్టవచ్చు.. ఈ ఫొటోలో ఉన్నది అప్పటి దివంగత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి భార్య లలితా శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు తన నివాసం 10 జనపథ్ లోని ఖాళీగాఉన్న ప్రాంతంలో గోధుమపంట వేశారు.. కూలీలు లేకుండా ఆయనే పోలంపనులు చేసి పంట వేసుకున్నారు. 1966 లో ఆహార కొరత ఏర్పడినప్పుడు ,అందరూ ధాన్యం పంటలు పండించాలని చెప్పి , తానే స్ఫూర్తి గ నిలిచారు. తరువాత ఆయన చనిపోయారు.. పంటచేతికొచ్చిన తరువాత ఇల్లు ఖాళీ చేస్తానని ఆమె ప్రభుత్వానికి చెప్పారు. తన భర్త చేతితో వేసిన పంటను తానే కోసుకొని , నూర్పిడి చేసి , గోధుమలు తీసుకెళ్లారు.. ఇప్పుడు ఆలోచించండి.. నాటి — నేటి రాజకీయ పరిస్థితులు..

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.