ఈ పాపను చూసాక అదంటే భయమెందుకు..?

  0
  237

  దేశంలో క‌రోనా మార‌ణ‌హోమం సృష్టిస్తున్న ద‌శ‌లో ఇప్ప‌టికీ ఈ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న లేనివాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. టీకాలు వేయించుకోవాలంటే భ‌యం. జ‌లుబు, ద‌గ్గు లాంటి ల‌క్ష‌ణాలు ఉన్నా, డాక్ట‌రుకి చూపించుకోవాలంటే భ‌యం.. ఇలాంటి భ‌యాల‌తో ప్రాణాలు పొగొట్టుకున్న‌వారే ఎక్కువ‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ మూడేళ్ళ పాప పెద్ద‌ల‌కు గుణ‌పాఠం నేర్పేలా త‌యారైంది. నాగాలాండ్ లో ఈ మూడేళ్ళ పాప ఒక్క‌టే హాస్పిట‌ల్ కి వెళ్ళింది. త‌న త‌ల్లి, తండ్రి ఉద‌యాన్నే పొలంలో ప‌నికి వెళ్ళార‌ని, మ‌ద్యాహ్నం నుంచి జ‌లుబు, ద‌గ్గు వ‌స్తోంద‌ని, త‌న‌కు క‌రోనా అనే భ‌యంతో ఆస్ప‌త్రికి వ‌చ్చాన‌ని తెలిపింది. ఆ పాప పేరు లిపవి. ఆ పాప అవ‌గాహ‌న‌కు, ధైర్యానికి డాక్ట‌ర్ ఆశ్చ‌ర్య‌పోయింది. వెంట‌నే ఆ పాప‌కు చికిత్స చేయించింది. క‌రోనా లేదంటూ చెప్పి, మందులు ఇచ్చి పంపించింది. దీంతో ఆ పాప పేరు దేశ‌వ్యాప్తంగా మార్మోగుతోంది. ఆ చిన్నారికి ఉన్న‌పాటి అవ‌గాహ‌న కూడా పెద్ద‌ల‌కు లేదంటూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో త‌మ అభిప్రాయాల‌ను చెబుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..