వేల ప్రాణాలు కాపాడిన ఎలుక రిటైర్ అయింది..

    0
    50

    ఆ ఎలుక పోలీస్ శాఖ నుంచి రిటైర్ అయ్యింది. నాలుగు సంవ‌త్స‌రాల పాటు మందుపాత‌ర‌లు క‌నుగొన‌డంలో విశేష కృషి చేసి ఎన్నో గోల్డ్ మెడ‌ల్స్ పొందిన ఆ ఎలుక‌ను రిటైర్ చేసి బోనులో ఉంచారు. మ‌ఘ‌వ అనే పేరు గ‌ల ఈ ఎలుక కొలంబియాలో పోలీసుల‌కు మందుపాత‌ర‌లు క‌నుగొన‌డంలో స‌హ‌క‌రించింది.

    ఇప్ప‌టివ‌ర‌కు 35 మందుపాత‌ర‌ల‌ను క‌నిపెట్టింది. వాటిలో 28 పేల్చేందుకు సిద్ధంగా ఉన్న మందుపాత‌ర‌లు. 2014లో టాంజానియాలో పుట్టిన ఈ ఎలుక‌కు ఒక బెల్జియం ఆర్గ‌నైజేష‌న్ మందుపాత‌ర‌లు క‌నుగొన‌డంలో ట్రైనింగ్ ఇచ్చింది. కాంబోడియా, అంగోలా, జింబాబ్వే, మొజాంబిక్ త‌దిత‌ర దేశాల్లో మందుపాత‌ర‌లు క‌నిపెట్ట‌డంలో ఎలుక‌ల‌కు శిక్ష‌ణ ఇస్తుంది. అలాగే ఈ ఎలుక‌కూ ట్రైనింగ్ ఇచ్చారు. ఇంత‌కాలం మ‌ఘ‌వ ఎలుక ఎన్నో వేల ప్రాణాలు కాపాడింద‌ని పోలీసులు ప్ర‌శంసించారు.

    త‌మ‌తో ఎంతో స్నేహంగా ఉండేద‌ని, తాము చెప్పిన ప‌ని చేసేద‌ని తెలిపారు. ఇప్పుడు వ‌య‌సు మీర‌డంతో ఇప్పుడు ఆ ఎలుక‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి, ఆ ఎలుక‌కు ప్ర‌త్యేక బోనును త‌యారు చేయించి ఆహారం అందిస్తామ‌ని తెలిపారు. దీని బాగోగుల కోసం ముగ్గురు కానిస్టేబుళ్ళ‌ను కూడా నియ‌మించారు. ఈ ఎలుక ఎక్కువ‌గా తాజా పండ్లు, కూర‌గాయ‌లు తింటుంద‌ని, రాత్రి ఎండు చేప‌లు, ప‌ప్పుధాన్యాలు తింటుంద‌ని చెప్పారు. రిటైర్మెంట్ సంద‌ర్భంగా ఆ ఎలుక సాధించిన మెడ‌ల్స్ తో దాన్ని అలంక‌రించారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..