”మిస్ శెట్టి ..మిస్టర్ పొలిశెట్టి’ అనుష్క‌ ..

  0
  601

  అనుష్క‌కి ఏజ్ పెరుగుతున్నా చాన్సుల‌కు మాత్రం కొద‌వ‌లేదు. యంగ్ హీరోయిన్ల‌ను డామినేట్ చేస్తూ త‌న రేంజ్ త‌గ్గ సినిమాలు… లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేస్తోన్న స్వీటీ… తాజాగా మ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌కంటే చిన్న‌వాడితో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్ర‌తో పెద్ద ప్ర‌యోగానికే రెడీ అయింది సూప‌ర్ లేడీ. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్.

  ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతి రత్నాలు’ సినిమాలతో సత్తా చాటి తనకంటూ స్పెషల్ ఇమేజ్ కూడగట్టుకున్న నవీన్ పోలిశెట్టి. అవును. ఈ జాతిర‌త్నంతోనే అనుష్క రొమాన్స్ చేయ‌బోతోంద‌ట‌. స్టోరీ లైన్ కూడా డిఫ‌రెంట్ గా ఉండ‌బోతోంది. 20 సంవత్సరాలు వ్యత్యాసమున్న స్త్రీ, పురుషుల మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొనే పరిమాణాలు ఏంటి? అనే సబ్జెక్ట్ తీసుకొని కథ సిద్ధం చేశారట డైరెక్టర్. అలాగే కథకు యాప్ట్ అయ్యేలా ఈ చిత్రానికి ”మిస్ శెట్టి ..మిస్టర్ పొలిశెట్టి’ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలిసింది.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..