గడ్డం షేవింగ్ , ట్రిమ్మింగ్ చేస్తే శిక్ష తప్పదు..

  0
  171

  ఆఫ్ఘ‌నిస్తాన్ లో తాలిబ‌న్లు త‌మ క్రూర‌వైఖ‌రిని ప్ర‌ద‌ర్శిస్తూ ఉన్నారు. నిన్న‌టికి నిన్న ఒక మృతదేహాన్ని క్రేన్‌కు వేలాడదీసి త‌మ రాక్ష‌స‌త్వాన్ని చాటారు. ఇప్పటికే మహిళలని ఇంటికే పరిమితం చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం, త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారిని నిర్ధాక్షిణ్యంగా చంపేయ‌డం వంటి చ‌ర్య‌ల‌తో భయంక‌ర వాతావ‌ర‌ణం సృష్టిస్తున్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు కొత్త ఆంక్ష‌లు విధిస్తున్నారు. మ‌గ‌వాళ్ళ గ‌డ్డాల‌పై ప‌డ్డారు. గ‌డ్డాలు తీయ‌డం, స్ట‌యిల్ గడ్డాలు పెట్టుకోవ‌డం, ట్రిమ్ చేయ‌డం వంటివి చేస్తే శిక్షార్హుల‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సెలూన్ ల వ‌ద్ద హెచ్చ‌రిక బోర్డులు కూడా పెట్ట‌డం గ‌మ‌నార్హం. ఇస్లాం చ‌ట్టాల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తూ, స్ట‌యిల్ గ‌డ్డాలు పెట్టుకుంటే స‌హించేది లేద‌ని తాలిబ‌న్ల ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.