మహిళా పేషెంట్ ని లోపలికి పిలిచి ..

  0
  317

  నడుం నొప్పి అని ఎముకల డాక్టర్ దగ్గరకు పోయిన ఓ మహిళను ఆ డాక్టర్ పరీక్ష పేరుతో లైంగిక వేధింపులకు గురి చేయడంతో పేషెంట్ బంధువుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి అతడిపై కేసు పెట్టి విచారణ జరుపుతున్నారు. గోవాలోని మపుస ప్రాంతంలో 35ఏళ్లు ఉన్న ఓ మహిళ నడుం నొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్లింది. ప్రైవేట్ రూమ్ లో పరీక్ష చేయాలని చెప్పి ఆమెను లోపలికి రమ్మన్నాడు. ప్యాంట్ విప్పించాడు.

  తర్వాత నడుముపై అటూ ఇటూ లాగుతూ చేయి మరింత కిందకు జారుస్తుండటంతో మహిళ అర్థం చేసుకుని డాక్టర్ చేతిని విసిరికొట్టింది. తర్వాత బోర్లా పండుకోవాలని చెప్పాడు. అయితే ఆమె వెంటనే లేచి బయటకు వచ్చింది. ఇంటికెళ్లింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే భర్త, బంధువులు ఆస్పత్రికి వచ్చి డాక్టర్ ని చావగొట్టారు. మహిళా రోగిని పరీక్షించే సమయంలో, మరో మహిళా అటెండెంట్ కానీ, ఆస్పత్రికి సంబంధించిన మహిళా ఉద్యోగి కానీ ఆ గదిలో ఉండాలనేది నిబంధన. అయితే డాక్టర్ లైంగిక వేధింపులకు గురి చేయడంతో దెబ్బలు తిని చివరకు పోలీస్ కేసులో ఇరుక్కున్నాడు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.