సినిమావాళ్లం.. కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి..

    0
    353

    సినిమావాళ్లల కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరారు మెగాస్టార్ చిరంజీవి. లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ఆయన కరోనా తర్వాత మారిన పరిస్థుతులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు తమ కష్టాలను అర్థం చేసుకోవాలని కోరారు.

    ‘‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని కోరుకునే మాకు, సాధకబాధకాలు ఉన్నప్పుడు మీరు దయ చేసి దీనిపై దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించాలి. ‘మేము ఆశగా అడగటం లేదు.. అవసరానికి అడుగుతున్నాం’. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా. సినిమాలు పూర్తయి కూడా మరో సినిమా చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయాం. ‘ఆచార్య’ అయిపోయింది. ఎప్పుడు విడుదల చేయాలి? ఎలా రిలీజ్‌ చేయాలి? చేస్తే రెవెన్యూ వస్తుందా? ఇలాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనాలు వస్తారా? లేదా? అన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. ‘లవ్‌స్టోరీ’ అన్నింటికీ దారి చూపే సినిమా అవుతుందని అనుకుంటున్నా. అయితే, రెవెన్యూ ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. ఈ విషయంలోనే ప్రభుత్వాలు మనకు ధైర్యం, వెసులుబాటు ఇవ్వాలి. వీలైనంత త్వరగా చిత్ర పరిశ్రమకు మేలు చేసే జీవోలను విడుదల చేయండి’’ అని చిరంజీవి విజ్ఞప్తి చేశారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.