గే ..అయితే గోడ దోసి చంపేస్తారు.

  0
  313

  ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంకీర్ణ దళాల ఉపసంహరణ జరిగిన తర్వాత. దాదాపు 60శాతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. సైనికులు కూడా ఆయుధాలు వదిలేసి పక్కన ఉన్న దేశాలకు పారిపోతున్నారు. లేదా లొంగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయేది తమ పరిపాలనేనంటూ పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ తమ వశం కాబోతోందని తాలిబన్లు ప్రకటించారు. ఇప్పటికే తాలిబన్ 60శాతం భూభాగంలో పెత్తనం చేస్తోంది. ఇస్లామిక్ లా ప్రకారం శిక్షలు వేస్తోంది.

  ఈ శిక్షలపై తాలిబన్ జడ్జి గుల్ రహీం ఓ జర్మన్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక దొంగతనం కేసుకి సంబంధించి దొంగ, కాళ్లతో తలుపులు తన్ని ఇంట్లోకి వెళ్లి ఉంగరం చోరీ చేశాడని, ఈ కేసులో తన శిక్ష ఎలా ఉందో వివరించాడు. ఉంగరం పోగొట్టుకున్న వ్యక్తిని, ఉంగరం చోరీ చేసిన చేయిని తీసేయమంటావా లేదా, తలుపుని తన్నిన కాలుని నరికేయమంటావా, లేదా రెండు శిక్షలు అమలు చేయమంటావా అని తాను అడిగానని చెప్పాడు. చేయి తీస్తే సరిపోతుందని ఉంగరం పోగొట్టుకున్న వ్యక్తి చెప్పడంతో, ఆ వ్యక్తి చేయి మణికట్టు వరకు తొలగించామని చెప్పాడు.

  ఒక్కో రకమైన నేరానికి ఒక్కో రకమైన శిక్ష ఉంటుందని వేలి గోళ్లు తీసేసే దగ్గర్నుంచి, వేలి కొనలు కత్తిరించడం, వేళ్లు కత్తిరించడం. అరచేయి వరకు తీసేయడం, మోచేయి వరకు తీసేయడం, భుజం వరకు తీసేయడం, అలాగే.. కాలి వేళ్లను నరికేయడం, పాదాలు నరికేయడం, మోకాలు వరకు నరకడం, ఇలాంటి శిక్షలు దొంగతనాలు చేసే వారికి అమలు చేస్తామని అంతకంటే తీవ్రమైన నేరాలు చేసే వారిని రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం, బహిరంగంగా శిరచ్ఛేదనం చేయడం, లేదా తుపాకీతో కాల్చి చంపడం.. వంటివి చేస్తామని చెప్పారు.

  స్వలింగ సంపర్క నేరానికి పాల్పడినవారికి ఎటువంటి శిక్షలు విధిస్తారన్న ప్రశ్నకు, అటువంటి నేరాలకు భవనాల పైనుంచి వారిని కిందకు తోసేస్తామని, లేదా 10 అడుగుల గోడ కట్టి ఆ గోడ పక్కన ఆ వ్యక్తిని నిలబెట్టి, గోడకు వీపు ఆనించి, ఆ గోడను తోసేసి చంపేస్తామని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తమ అధీనంలోకి వస్తే మహిళలు అనుమతి లేకుండా బయట తిరిగేందుకు వీలు లేదని, నడిచేటప్పుడు కాళ్లు కనపడినా, కాళ్లు నరికేస్తామని, రక్త సంబంధీకులు తోడు లేకుండా కూడా బయటకు రాకూడదని చెప్పారు. మరో 5 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తమ అధీనంలోకి వచ్చేస్తుందని తెలిపారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.