మొన్నఆమె స్వీపర్, ఈ రోజు డెప్యూటీ కలెక్టర్.

    0
    627

    నిన్న మొన్నటి వరకు ఆమె స్వీపర్.. ఈ రోజు డెప్యూటీ కలెక్టర్.. ఇదేదో సినిమా కధకాదు.. ఓ పేద యువతి అద్భుత జీవిత ప్రస్థానం.. 16 ఏళ్ళ వయసులోనే ఆషా అనే యువతికి పెళ్లయింది.. ఇద్దరు బిడ్డలుపుట్టిన తర్వాత భర్త వదిలేసి వెళ్ళిపోయాడు.. తన కడుపుకు తిండి సంగతెలాఉన్నా , బిడ్డల పోషణకోసం రాజస్థాన్ జోధ్ పూర్ మున్సిపాలిటీలో టెంపెరరి స్వీపర్ గా చేరింది.. వీధులు చిమ్ముతూనే , బిడ్డలను పోషించుకుంటూ చదువుకుంది.. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచింది.. పోరాటం చేసింది.. రెండేళ్ల క్రితం రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ పరీక్షలు రాసింది. రెండేళ్ల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి.. మొదటి ప్రయత్నంలోనే డెప్యూటీ కలక్టర్ పోస్టుకు ఎంపికైంది. ఇప్పుడు , స్వీపర్ ఆషా , డిప్యూటీ కలెక్టర్. విధిని ఎదిరించి గెలిచిన మహిళ.. త్వరలో ఆమె ఉద్యోగంలో చేరబోతోంది..

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.