కాస్టింగ్ కౌచ్ పర్వంలో ఇలాకూడా చేశారు..

  0
  11909

  క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండ‌స్ట్రీలో ఎంద దుమారం రేపిందో అంద‌రికీ తెలిసిందే. దీనిపై ఒక్కొక్క‌రూ త‌మ గ‌ళాన్ని విప్పుతూ వ‌చ్చారు. తాజాగా ఉత్త‌రాది భామ సుర్వీన్ చావ్లా కూడా నోరు విప్పింది. ఈమె తెలుగులో ‘రాజు మ‌హ‌రాజు’ చిత్రంలో న‌టించింది. వీటితోపాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, పంజాబీ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో న‌టించింది. తాజాగా ఈ చండీఘ‌డ్ బ్యూటీ ఓ ఇంట‌ర్వూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్ర‌స్తావిస్తూ, ద‌క్షిణాది డైరెక్ట‌ర్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

  ‘జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న ద‌క్షిణాదికి చెందిన ఓ ద‌ర్శ‌కుడు చేస్తున్న సినిమా ఆడిష‌న్‌కు వెళ్లాను. కొన్ని గంటలపాటు అడిషన్స్‌ నిర్వ హించారు. అయితే అత‌ని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆరోగ్యం బాగోలేదని ఇంటికి వచ్చేశాను.

  ఆ తర్వాత ఆయన అసిస్టెంట్లు పలుమార్లు టెలిఫోన్‌ లో నన్ను సంప్రదించినా ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు.. అయితే, ఆ సినిమా ఇప్పటివరకు విడుదల కాలేదని’ సుర్వీన్ చెప్పారు. అలాగే, ఇద్దరు హిందీ దర్శకుల నుంచి కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు ఆమె తెలిపారు. ముఖ్యంగా ఈ ఇద్దరు దర్శకుల్లో ఒకరు క్లీవేజ్‌ చూడాలని కోరగా, తాను తోసిపుచ్చానని వెల్లడించారు. ఇంకో దర్శకుడు అయితే, అడిషన్స్‌ పేరుతో దేహాన్ని పరిశీలించాలని కోరగా, దానికి తాను నిరాకరించినట్టు సుర్వీన్‌ చావ్లా వెల్లడించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.