పుల్ల ఇడ్లీ..ఎలా వస్తాయి? ఇలాంటి ఐడియాలు..

    0
    232

    బెంగళూరు ఇన్నోవేషన్ క్యాపిటల్ గా చెబుతుంటారు.. చాలా కొత్త కొత్త ఐడియాలు అక్కడి నుంచే దేశమంతా వ్యాపిస్తుంటాయి. ఎందుకంటే దేశంలోని చాలా రాష్ట్రాల్లోని యువత బెంగుళూరు నుంచే తమ ప్రస్థానాన్ని ప్రారంభిస్తారు. అక్కడ కొత్తగా ఏం చేయాలనుకున్నా అవకాశం ఉంటుంది. దీనికితోడు అక్కడివారు చాలా క్రియేటివ్ ఆలోచనలను ప్రోత్సహిస్తారు. కొత్త ఆలోచనలకు.. బెంగుళూరులో అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటుంటాయి. అందుకే ఎన్నో రకాల ఐడియాలు మొదట బెంగుళూరు నుంచే ప్రారంభమవుతుంటాయి.

    తాజాగా ఓ క్రియేటివ్ ఆలోచన నెటిజన్లను ఆకర్షిస్తోంది. సాధారణంగా ఇడ్లీలు దేశమంతటా ఒకేలా ఉంటాయి. గుండ్రంగా ఉండే ఇడ్లీలను మనం చూస్తూనే ఉంటాం.. ఇడ్లీలలో రకాలను కూడా మనం తినే ఉంటాం. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఇడ్లీ మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే ఈ ఇడ్లీ గుండ్రంగా ఉండదు. ఓ పుల్ల ఇడ్లీలకు గుచ్చి ఉంటుంది. చూసేందుకు చాకో బార్ ఐస్ క్రీమ్ లా కనిపిస్తుంది. ఇంతలా క్రియేటివ్ గా ఇడ్లీలను తయారు చేసింది కూడా బెంగుళూరు వాసులేనండోయ్.. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి.. మన ఆనంద్ మహీంద్రా దగ్గరకు చేరింది. ఇంకేముంది.. కొత్తదనాన్ని ప్రోత్సహించే ఆనంద్ మహీంద్రా కాస్తా.. ఇప్పుడు ఈ స్పెషల్ ఇడ్లీల గురించి ట్వీట్ చేశాడు. ఆ పుల్ల ఇడ్లీలను చేతిలో పట్టుకొని.. కొబ్బరి చెట్నీలోనో.. లేక సాంబార్ లోనే ముంచి తింటుంటే ఉంటుంది.. నా సామి రంగా..ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ ట్రయిల్ వెయ్యండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.