ఆ లేడీ డాక్టర్ల బాత్రూంలో స్పై కెమెరాలు..

  0
  829

  స్పై కెమెరాలతో య‌మ డేంజ‌ర్‌. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా… కేటుగాళ్ళు మాత్రం స్పై కెమెరాలు అమ‌ర్చి లేడీస్ హాస్ట‌ళ్ళ‌ల్లో, బాత్రూమ్ ల‌లో పెట్టేస్తున్నారు. అలాంటిదే ఇది కూడా. పూణెలోని ఓ ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో 30 ఏళ్ళు ఉన్న ఇద్ద‌రు లేడీ డాక్ట‌ర్లు ప‌ని చేస్తున్నారు. ఆస్ప‌త్రికి చెందిన క్వార్ట‌ర్స్ లోనే ఉంటున్నారు. అయితే బుధ‌వారం నాడు బాత్రూమ్ కి వెళ్ళిన ఓ లేడీ డాక్ట‌ర్… లైట్ వెల‌గ‌క‌పోవ‌డంతో ఎల‌క్ట్రీషియ‌న్ ను పిలిపించింది. బ‌ల్బ్ హోల్డ‌ర్ విప్పి చూస్తే.. షాకింగ్ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అందులో స్పై కెమ‌రాతో పాటు మెమొరీ కార్డు కూడా ఉంది. అలాగే బెడ్రూమ్ లైట్ చెక్ చేస్తే.. ఆ బ‌ల్బ్ లోనూ ఇవే ఉండ‌డంతో షాక్ గురైంది ఆ లేడీ డాక్ట‌ర్. వెంట‌నే పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. వెంట‌నే స్పందించిన పోలీసులు క్వార్ట‌ర్స్ కి చేరుకుని క్షుణ్ణంగా ప‌రిశీలించారు. డాక్ట‌ర్లు ఉండే క్వార్ట‌ర్స్ లో అందులోనూ బల్బుల్లో స్పై కెమెరా ఎవ‌రు పెట్టార‌నే కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఆస్ప‌త్రికి సంబంధించినవారా లేక బ‌య‌టివారి ప్ర‌మేయం ఉందా అని విచార‌ణ ప్రారంభించారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.