చచ్చిన తిమింగలంలో 10 కోట్ల అంబర్..

    0
    248

    ఉదయాన్నే చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బృందానికి అదృష్టం ఎదురొచ్చింది. దాదాపు 10కోట్ల రూపాయలు విలువ చేసే అంబర్ గ్రిస్ దొరికింది. స్పెర్మ్ వేల్స్ రకానికి చెందిన తిమింగళాలలో ఈ అంబర్ గ్రిస్ ఉంటుంది. ఇది అప్పుడప్పుడూ దాన్ని వాంతి కూడా చేసుకుంటుంది. యెమన్ దేశంలో 35మంది మత్స్యకారుల బృందం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లింది.

    యెన్ దక్షిణ భాగంలోని సెరియా తీరంలో వారికి ఒక స్పెర్మ్ వేల్ కళేబరం కనిపించింది. దాన్ని కోసి చూడటంతో కడుపులో 127 కిలోల అంబర్ గ్రిస్ దొరికింది. అంబర్ గ్రిస్ నిజమైనదా, నాణ్యమైనదేనా అని తేల్చుకునేందుకు దాంట్లో కొంత భాగం తీసి వెలిగిస్తే పెట్రోల్ లాగా మండుతుంది. వేటకు పోయిన అందరూ ఈ అంబర్ గ్రిస్ ను అమ్మగా వచ్చిన ఆదాయాన్ని సమంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్కెట్ లో అది 10కోట్లకు అమ్ముడుపోయింది.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..