త్వరలో చైనా నుంచే కోవిడ్ 26, కోవిడ్ 32..

  0
  101

  కరోనా వైరస్ పుట్టుక తేల్చకపోతే మానవ జాతి వినాశనం తప్పదని అమెరికా శాస్త్రవేత్తలు గట్టి హెచ్చరిక చేశారు. ఒక దేశం అని కాకుండా ప్రపంచ మానవాళికి ఇది వినాశకారి కాబోతోందని స్పష్టం చేశారు. కోవిడ్-19 పుట్టుక ఎలా, ఎక్కడో తేల్చని పక్షంలో కొవిడ్ 26, కొవిడ్ 32 అనే రకాల వైరస్ లు కూడా పుట్టుకొచ్చి మహా విలయం సృష్టిస్తాయని మారణహోమానికి దారి తీస్తాయని హెచ్చరించారు. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో 2019లో కరోనా వైరస్ పుట్టిందన్న సిద్ధాంతం ఇప్పుడిప్పుడే బలపడుతున్న నేపథ్యంలో ఇది చైనా శాస్త్రవేత్తలు సృష్టించిన జీవాయుధమేనని ఒక అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో దీని మూలాలు తెలుసుకోనిదే ఆ వైరస్ ని సమర్థవంతంగా అరికట్టడం వీలు కాదని అన్నారు.

  ప్రపంచంలో చాలా దేశాలు, కరోనా వైరస్ పుట్టుక ఎక్కడో తేల్చాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తమ తమ దేశాలు ఇంటెలిజెన్స్ సంస్థలను కూడా ఈ పనికి పురికొల్పారు. మొదటగా ఈ పనిచేసింది ఆస్ట్రేలియా. కరోనా వైరస్ పుట్టుక ఎక్కడో తేలకపోతే, ప్రపంచంలో మహా మారణహోమం తప్పదని మొదట ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలే హెచ్చరించారు. గత ఆదివారం ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ మూలాల గురించి జరుగుతున్న పరిశోధనలో తమకు సహకరించాలంటూ చైనాకు విజ్ఞప్తి చేశారు.

  స్కాట్ గొటిలెప్ అనే శాస్త్రవేత్త అమెరికాలో ట్రంప్ కి గతంలో సలహాదారుగా ఉన్నారు. ఆయన కూడా కరోనా వైరస్ జంతువులనుంచో, పక్షులనుంచో వచ్చింది కాదని, ఇది వుహాన్ ల్యాబ్ నుంచే లీకైన జీవాయుధమని తానెప్పుడో చెప్పానని అన్నారు. టెక్సాస్ లోని చిన్న పిల్లల ఆస్పత్రి వైరాలజిస్ట్ డాక్టర్ పీటర్ హోటెజ్ మాత్రం కరోనా వైరస్ మూలాలు తెలుసుకోలేకపోతే కోవిడ్ 26, కోవిడ్ 32లాంటి వైరస్ లను మళ్లీ చైనా ప్రపంచంమీదకు వదులుతుందని చెప్పారు. అందువల్ల ప్రపంచ దేశాలన్నీ ఈ విషయంలో కచ్చితంగా వైరస్ మూలాలను చైనా తేల్చాలని డిమాండ్ చేశాయి.

  ఇవీ చదవండి..

  ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

  కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

  ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

  ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..