గర్భం లేదు, పిల్లలు లేరు, అంతా ఉత్తుత్తిదే..

  0
  3085

  ఒకే కాన్పులో 10మంది పిల్లలంటూ, ఇదో ప్రపంచ రికార్డు అంటూ హడావిడి చేసిన ఉదంతం ఉత్తుత్తిదని తేలిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన సిథోల్ అనే 37ఏళ్ల మహిళ ఒకే కాన్పులో 10మంది పిల్లల్ని కన్నదంటూ, పిల్లలతో సహా ఇంటర్నెట్ లో సెన్సేషన్ అయింది. కాన్పు కాకముందు ఆమె కడుపు, గర్భంతో ఉన్న చిత్రాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  10మంది బిడ్డల్ని కన్నదంటూ ఫొటోలు వచ్చిన తర్వాత ప్రపంచంలో చాలామంది ఆ బిడ్డలకు సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. ఈ మహిళపై విస్తృతంగా చర్చ కూడా జరిగింది. వండర్ మదర్ అంటూ ప్రశంసలు కూడా కురిపించేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆ బిడ్డలు ఎక్కడ? ఫొటోలు మాత్రమేనా అంటూ వ్యక్తమైన అనుమానాలకు ఇప్పుడు మూలాలు దొరికాయి. అసలామె గర్భంతో లేదని, ఆమెకు బిడ్డలే పుట్టలేదని తేల్చారు. జోహ్నస్ బర్గ్ లోని తింబిసా ఆస్పత్రిలో గత వారం ఆమెను అడ్మిట్ చేశారు. ఆమెపై జరిపిన పరీక్షల్లో ఆమెకు గర్భమే రాలేదని, సిజేరియన్ చేసినట్టు ఆధారాలే లేవని తేల్చారు.

  ఆమె మానసిక పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నారు. గర్భంతో ఉన్నట్టు దిండ్లు పెట్టుకుని, ఫొటోలు దిగిందని తేల్చారు. ఆమె బాయ్ ఫ్రెండ్ తెబెగో కూడా తన ప్రియురాలిని కలుసుకునేందుకు చాలా ప్రయత్నం చేశానని, అయితే పుట్టిన బిడ్డలు ఎలా ఉన్నారో తనకు కూడా తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీరా అసలామెకు గర్భమే లేదని, తేలిన తర్వాత ఇప్పుడు నెటిజన్లు ఆమెను ఆడిపోసుకుంటున్నారు. ఇంత మోసం చేస్తావా అంటూ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..