క్రికెట్ బెట్టింగ్ స్థావ‌రాల‌పై దాడులు .

  0
  186

  హైద‌రాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ స్థావ‌రాల‌పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 22 ల‌క్ష‌ల 50 వేల రూపాయ‌లు, పెద్ద‌సంఖ్య‌లో సెల్ ఫోన్లు, బెట్టింగ్ బోర్డ్, ల్యాప్ టాప్ వంటివి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ లో జ‌రుగుతున్న సూప‌ర్ లీగ్ మ్యాచ్ ల‌కు ఈ ముఠా ఆన్ లైన్ ద్వారా బెట్టింగులు నిర్వ‌హిస్తోంది.

  కూక‌ట్ ప‌ల్లి, నిజాంపేట్ స్థావ‌రాల్లో ర‌హ‌స్యంగా కొన్ని అపార్టుమెంట్లో ఈ బెట్టింగులు చేస్తున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన సోమ‌న్న ముఠా ఈ బెట్టింగుల‌కు పాల్ప‌డుతోంది. ఆన్ లైన్ లో కొన్ని మొబైల్ యాప్ ల ద్వారా ఈ బెట్టింగులు నిర్వ‌హిస్తున్నారు. బెట్ 365, బెట్ ఫెయిర్, లైవ్ లైన్ గురూ, లోట‌స్ ఇలాంటి బెట్టింగ్ యాప్ ల‌తో లావాదేవీలు చేస్తున్నారు.

  అస‌లు సూత్ర‌ధారి సోమ‌న్న త‌ప్పించుకున్నాడు. ఈ బెట్టింగుల్లో ఎక్కువ మంది విద్యార్ధులు, యువ‌కులు పాల్గొంటున్నార‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ తెలిపారు. అందువ‌ల్ల పిల్ల‌ల త‌ల్లిదండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, పిల్ల‌ల‌పై క‌న్నేసి ఉంచాల‌ని హెచ్చ‌రించారు.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..