పెళ్లయిన పదోరోజే భార్యతో విషం తాగించిన భర్త..

  0
  12180

  వైవాహిక జీవితంపై బోలెడు ఆశలతో అత్తగారింటికి వచ్చింది ఆ యువతి. పెళ్లైన రోజు సంతోషంగానే ఉన్న భర్త, శోభనం రోజు కూడా ఆనందంగానే గడిపాడు. ఆ తర్వాతే అసలు విషయం బయటపెట్టాడు. తనకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని, ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయే సరికి నిన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. సర్దుకుపోదాం అంది భార్య, అయితే భర్త ఒప్పుకోలేదు.

  మనసు చంపుకుని నీతో కాపురం చేయలేను, ఆ అమ్మాయిని మరచిపోలేను అంటూ సినిమా డైలాగులు కొట్టి, పురుగుల మందు బాటిల్ మూత తీశాడు. భార్యతో తాగించాడు, తను కూడా తాగాడు. గొంతు మంటెక్కడంతో భార్య బయటకు వెళ్లి అత్తమామలకు విషయం చెప్పింది. దీంతో వారిద్దర్నీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువజంట చావుబతుకుల మధ్య చికిత్స తీసుకుంటోంది. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూరులో జరిగింది. పెళ్లయిన పది రోజులకే ఈ ఘోరం జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన ఆ భార్యా భర్తల పేర్లు బీమయ్య, స్వాతి.

  ఇవీ చదవండి..

  లా చదివిన ఆమె.. లారీ డ్రైవర్ ఎందుకయింది..?

  వుహాన్ ప్రయోగశాలలో రహస్య గదిలో గబ్బిలాలు.

  అందాల రాసి రాశీఖ‌న్నా ఓ సైకో అట‌..

  కొత్త కోడలుకి .అత్తగారింటి నోట్ల కట్టలతో స్వాగతం.మెట్టుమెట్టుకి ఒక నోట్ల కట్ట .. చూడండి. తమాషా..