ఐటీ దాడులపై సోనూ సూద్ రియాక్షన్ అదిరిపోయింది..

    0
    305

    తనపై జరిగిన ఇన్ కమ్ ట్యాక్స్ దాడుల గురించి సోనూ సూద్ అత్యంత వినయంగా, గౌరవంగా సమాధానం చెప్పాడు. జరిగిందేమిటో తాను చెప్పాల్సిన అవసరం లేదని, కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. తాను దేశ సేవ కోసమే అంకితం కావాలని ప్రతినబూనానని, ఇందుకోసం శక్తిని సహృదయాన్ని ప్రజలే ఇస్తారని అన్నారు. తన ఫౌండేషన్ లో ప్రతి రూపాయి అవసరంలో ఉన్నవారికి చేరుతుందని, విలువైన జీవితాలను కాపాడుతుందని అన్నారు. తాను చాలా బ్రాండ్ లకు అంబాసిడర్ గా పనిచేశానని, దానివల్ల వచ్చే డబ్బుని సేవా కార్యక్రమాలకు వినియోగించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తన ప్రజా సేవా యజ్ఞం కొనసాగుతుందని అన్నారు. గత 4 రోజులుగా అనుకోని అతిథులతో సరిపోయిందని కాలం గడిచిందని ఇప్పుడు మళ్లీ అనాథలు, అన్నార్తుల సేవకు అంకితమవుతున్నానని చెప్పారు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.