సోనూ సూద్ ని మహేష్ బాబు కొడతాడా..? ఎంత ధైర్యం..?

  0
  482

  కుర్రాడి వ‌య‌సు ఏడేళ్ళు…
  సోనూకి డైహార్డ్ కోర్ ఫ్యాన్‌…
  ఏం చేశాడో తెలిస్తే…. షాక్ అవ్వాల్సిందే..
  అభిమానుల్లో ఇలాంటి అభిమానిని గ‌తంలో ఎన్న‌డూ చూసి ఉండ‌రు. వ‌య‌సు ఏడేళ్ళు. సోనూసూద్ కి డైహార్డ్ ఫ్యాన్. లాక్ డౌన్ స‌మ‌యంలో ఆప‌ద్భాంధ‌వుడిగా మారిన సోనూని రియ‌ల్ హీరోగా భావిస్తాడు ఆ కుర్రాడు. టీవీలో వ‌స్తున్న ఓ సినిమాలో సోనూసూద్ ని ఓ హీరో కొట్టడం చూసి త‌ట్టుకోలేక‌, టీవీని బ‌ద్ద‌లు కొట్టాడు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
  తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్ మండలం వేపలసింగారానికి చెందిన చండపంగు గురవయ్య, పుష్పలత తమ ఏడేళ్ల కుమారుడు విరాట్‌తో కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు న్యాల్కల్ వెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులందరూ కలిసి టీవీలో దూకుడు సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్ అయిన సోనూసూద్‌ను హీరో మ‌హేష్ బాబు కొట్టడం.. ఆ కుర్రాడు త‌ట్టుకోలేకపోయారు. ఆవేశంతో బ‌య‌ట‌కెళ్ళి రాయి తీసుకొచ్చి టీవీ మీద‌కి విసిరికొట్టాడు. దీంతో టీవీ స్క్రీన్ మొత్తం ప‌గిలిపోయింది. దీంతో టీవీ చూస్తున్న కుటుంబ సభ్యులు షాక్ కి గుర‌య్యారు. టీవీని ఎందుకు పగలగొట్టావని ప్రశ్నించగా, అతడు చెప్పిన సమాధానం వారిని మరింత ఆశ్చర్యపరిచింది. సోనూసూద్‌ను కొట్టడంతో తనకు కోపం వచ్చిందని, అందుకే టీవీని పగలగొట్టానని చెప్పడంతో వారంతా విస్తుపోయారు. ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన దీనిని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.