పరువు తీసిన ప్రియమణి, హత్య చేసిన మామ..

  0
  51449

  భర్త ఖతర్ వెళ్లాడు, కొన్నాళ్లు భార్య కుదురుగానే ఉంది. ఆ తర్వాత నడవడిక మారింది. భార్య మరొక యువకుడితో సన్నిహితుడుగా ఉందనే అనుమానం కుటుంబ సభ్యులకు వచ్చింది. దీంతో ఆమెపై పోలీస్ కేసు కూడా పెట్టారు. చివరకు విసిగి వేసారి ఆమెను హత్య చేశారు. సొంత మామ, కోడల్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మలికిపురం మండలం మేడిచర్లపాలెంలో చోటు చేసుకుంది. చొప్పల సత్యనారాయణ అనే వ్యక్తి తన కోడలు ప్రియమణి(25)ని చాకుతో పొడిచి హత్య చేసి, పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయాడు.

  సత్యనారాయణ కుమారుడు విజయ్‌ కుమార్‌ కు ఏడేళ్ల క్రితం ప్రియమణితో వివాహం అయింది. విజయ్ కుమార్ మేనమామ కుమార్తే ప్రియమణి. ఈ దంపతులకు ఓ బాబు ఉన్నాడు. విజయ్‌ కుమార్‌ ఉపాధికోసం ఖతర్ వెళ్లాడు. ప్రియమణి తల్లి, కుటుంబ సభ్యులు అండమాన్‌ లో ఉంటున్నారు. కోడలు ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటోందని.. ఆమె నడవడిక సరిగాలేదని కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి.

  ఈ నెల 22న ప్రియమణి సదరు యువకుడితో కలిసి వెళ్లిపోయినట్లు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిని వెతికి తీసుకొచ్చిన పోలీసులు ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రియమణి తల్లి మంజుల అండమాన్‌ నుంచి మేడిచర్లపాలెం వచ్చింది. ఈ సందర్భంగా ఇంట్లో కోడలికి, మామకు ఘర్షణ జరగడంతో కోపంలో చాకుతో ఆమెను పొడిచాడు. ఆ సమయంలో తల్లి మంజుల అడ్డురాగా స్వల్ప గాయాలయ్యాయి.

   

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?