ఫ్రీ ఫైర్ ఆడాడు.. అమ్మ అకౌంట్ ఖాళీ చేశాడు..

    0
    605

    ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఓ కుర్రాడు అమ్మ అకౌంట్ లోనుంచి ఏకంగా 3లక్షల 20వేల రూపాయలు ఖాళీ చేశాడు. ఈ ఘటన చత్తీస్ ఘడ్ లోని కంకే అనే ఊరిలో జరిగింది. సుభద్రా పాల్ అనే టీచర్, ఇటీవల లాక్ డౌన్ టైమ్ లో ఆన్ లైన్ క్లాసులకోసం తన 12 ఏళ్ల పిల్లవాడికి మొబైల్ ఫోన్ కొనిచ్చింది. దాంతో క్లాసులు వింటూనే మరోవైపు ఫ్రీ ఫైర్ గేమ్ కూడా ఆడటం మొదలు పెట్టాడు పిల్లవాడు. మెల్లగా వెబన్స్ కొనడం అలవాటు చేసుకున్నాడు. దానికోసం తల్లి అకౌంట్ ని లింక్ చేసుకున్నాడు. ఆ అలవాటు వ్యసనంగా మారి వెపన్స్ కొంటూ, లెవల్స్ పెంచుకుంటూ పోయాడు. తనకి తెలియకుండానే ఏకంగా 3.20 లక్షల రూపాయలు ఖాళీ చేశాడు. మార్చి 8నుంచి జూన్ 10లోపు తల్లి అకౌంట్ నుంచి డబ్బు మాయమైంది. ఓటీపీలు కూడా రాకపోవడంతో తల్లి జాగ్రత్తపడలేకపోయింది. మొత్తం డబ్బంతా పోయిన తర్వాత అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసి లబోదిబోమంది.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.