కరోనా మందు అన్నాడు.. ముగ్గురు ప్రాణాలు తీశాడు..

    0
    7934

    కరోనా రాకుండా నివారించే ఇమ్యూనిటీ బూస్టర్ ట్యాబ్లెట్లు, ప్రభుత్వం అందరికీ పంచిపెట్టమని చెప్పింది అంటూ.. మున్సిపాల్టీ హెల్త్ అసిస్టెంట్ ఒకరు ఓ ఇంటికొచ్చి ట్యాబ్లెట్లు ఇచ్చాడు. హెల్త్ అసిస్టెంటే కదా అంటూ నమ్మకంగా ఆ ట్యాబ్లెట్లు తీసుకున్న కుటుంబ సభ్యులు వాటిని తలా ఒకటి వేసుకున్నారు. అంతే, ఉన్నట్టుండి అందరూ కుప్పకూలిపోయారు. అందులో ముగ్గురు చనిపోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషం ట్యాబ్లెట్లు వేసుకోవడంతో ఈ దారుణం జరిగినట్టు డాక్టర్లు నిర్థారించారు.


    అసలేం జరిగింది..?
    తమిళనాడులో జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు పరిశీలిస్తే, కేవలం అప్పు తీర్చాల్సి వస్తుందన్న ఆలోచనతో ముగ్గురు ప్రాణాలు పొట్టన పెట్టుకున్నాడు కల్యాణ సుందరం అనే వ్యక్తి. ఇటీవల ఇతను కరుప్ప గౌండర్ అనే వడ్డీ వ్యాపారి వద్ద 15లక్షలు అప్పు తీసుకున్నాడు. కరోనా టైమ్ లో అప్పుతీర్చే దారి కనపడలేదు. తీర్చాలన్న ఉద్దేశమూ కల్యాణ సుందరానికి లేదు. దీంతో అతనో పథకం పన్నాడు. ఏకంగా కరుప్ప గౌండర్ ని లేపేయాలని, అలా చేస్తే తన అప్పు చెల్లించాల్సిన అవసరం లేదని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, మున్సిపాల్టీ హెల్త్ అసిస్టెంట్ శబరికి లంచం ఇచ్చి, ఫలానా ఇంట్లో ఫలానా మాత్రలు ఇవ్వాలని చెప్పాడు. అయితే ఆ విషం ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కరుప్పగౌండర్ భార్య, కూతురు, పని మనిషి చనిపోయారు. కరుప్ప ఆస్పత్రిలో ఉన్నాడు.
    సీసీ కెమెరాల ఆధారంగా ఆ కుటుంబంపై జరిగిన హత్యాయత్నాన్ని కనిపెట్టారు పోలీసులు. శబరిని అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ సుందరం పరారీలో ఉన్నాడు.

    సీసీ కెమెరాల ఆధారంగా ఆ కుటుంబంపై జరిగిన హత్యాయత్నాన్ని కనిపెట్టారు పోలీసులు. శబరిని అదుపులోకి తీసుకున్నారు. కల్యాణ సుందరం పరారీలో ఉన్నాడు.

    ఇవీ చదవండి..

    చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

    ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

    హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

    పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.