ఎన్నో ఏళ్ల తర్వాత ఆకాశంలో అసలేం జరగబోతోంది..?

    0
    154

    ఈ ఏడాదిలో తొలి సూర్య గ్రహణం జూన్ 10న సంభవించనుంది. మనదేశంలో మాత్రం ఈ గ్రహణ ప్రభావం పాక్షికంగానే ఉంటుంది. పంచాంగం ప్రకారం ఈ ఏడాది మొత్తం రెండు చంద్ర గ్రహణాలు, రెండు సూర్య గ్రహణాలు సంభవించనున్నాయి. మొదటి సూర్యగ్రహణం జ్యేష్ఠ మాస అమవాస్య రోజున రానుంది. దీంతో పాటూ శని జయంతి కూడా ఉండటం వల్ల ఈ గ్రహణానికి అధిక ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం.. దీన్ని అశుభంగా పరిగణిస్తోన్నారు పండితులు.

    జ్యేష్ఠ మాసం కృష్ణపక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అతి అరుదుగా సంభవిస్తుంటుందని చెబుతున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత గానీ ఇలాంటి అరుదైన కూటమి సంభవించదని అంటున్నారు.అయితే మన దేశంలో మాత్రం ఈ గ్రహణం కనిపించే వీలు లేదని కొందరు చెబుతున్నారు. ఈ శాన్య రాష్ట్రాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ప్రదేశాల్లో గ్రహణం కనిపించే వీలు లేకపోలేదు.. ఇవి కాకుండా కొంత సమయం జమ్మూ, కశ్మీర్ లో కనిపిస్తుంది. పీఓకేలో కూడా కనిపించే అవకాశముంది. ఈ సూర్యగ్రహణం ప్రభావం మాత్రం భారత్ లో అంతగా ఉండదు.

    భారత కాలమానం ప్రకారం సూర్యగ్రహణం జూన్ 10వ తేదీన మధ్యాహ్నం 01.42 గంటలకు ప్రారంభమవుతుంది. వలయాకారం లేదా కంకణ సూర్యగ్రహణం మధ్యాహ్నం 02.30 గంటలకు ఆరంభమవుతుంది. గ్రహణం మధ్య కాలం 04.12 గంటలకు వరకు ఉంటుంది. వలయాకార సూర్యగ్రహణం సాయంత్రం 05.03 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 06.41 గంటల వరకు గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. అంటే దాదాపుగా 5 గంటల వరకు గ్రహణం ఉంటుంది.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..