మునగాకు సూప్ తో షుగర్ కి చెక్ పెట్టండి

    0
    242

    కరోనా కాలంలో రోగ నిరోధ శక్తి పెంచుకోడానికి విటమిన్ ట్యాబ్లెట్లు మింగేస్తుంటారు చాలామంది. అంత కాదు, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా నాన్ వెజ్ లాగించేస్తుంటారు. మరి శాకాహారుల పరిస్థితి ఏంటి..? రోగనిరోధ శక్తి పెంచుకోవాలంటే వారు ఏం చేయాలి..? ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఆహారంతోపాటు ఇదిగో ఈ మునగాకు సూప్ తీసుకుంటే దివ్యౌషధంలా పనిచేస్తుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు, షుగర్ లెవల్స్ కి కూడా చెక్ పెట్టేయొచ్చని చెబుతున్నారు.
    ములక్కాడ రసం వారానికి ఒక్కసారి తాగితే.. రక్తపోటును తగ్గించడమే కాకుండా.. డయబెటీస్ రోగులలోని రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రిస్తుంది. అలాగే నిద్రలేమి, గొంతు నొప్పి, జలుబు, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ములక్కాడ ఆకుల రసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.

    కావల్సినవి…
    ములక్కాడ ఆకులు.. 1 1/2 ఆకులు..
    బియ్యం నీరు.. 2 కప్పులు
    సాంబార్ ఉల్లిపాయ..5
    టమోటాలు..1
    పచ్చిమిర్చి..1
    కొబ్బరి పాటు.. 1 కప్పు
    జీలకర్ర.. 1 స్పూన్
    మిరియాలు.. 1/2 స్పూన్
    ఉప్పు… తగినంత

    తయారీ విధానం..
    ముందుగా బియ్యం నానబెట్టిన నీటిని ఒక పాత్రలో వేసి మరిగించాలి. ఆ తర్వాత అందులో ములక్కాడ ఆకులు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులోనే టామోటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఈ పదార్థాలన్ని ఉడికిన తర్వాత అందులోనే కొబ్బరి పాలు, మిరియాల పొడి, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడకబెట్టాలి. పక్కనే మరో బాణలిలో నూనె వేడి చేసి.. జీలకర్ర, కరివేపాకు వేసి ములక్కాడ నీటిలో కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన గొంతు నొప్పి, జలుబు సమస్యలు, దగ్గు తగ్గుతుంది.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..