విమానంలో పాము.. భయంతో ప్రయాణికులు పరార్..

  0
  102

  బస్సులోనో, కారులోనో, మోటర్ బైక్ లోనో.. పాములు దూరడం అందరం చూసి ఉంటాం. అయితే ఇప్పుడు ఏకంగా ఒక విమానంలోకే పాము దూరింది. కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఫ్లైట్ లో ఓ పాము కనిపించింది. విమానం ముంబైకి బయలుదేరే ముందు ఈ పాముని గుర్తించిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బోర్డింగ్ పాస్ తీసుకుని ప్రయాణికులు విమానం ఎక్కబోయే ముందు ఈ పాముని గుర్తించారు. ఒక బ్యాగేజీకి చుట్టుకుని ఉన్న ఈ పాముని చూసి సిబ్బందికి చెప్పడంతో గ్రౌండ్ స్టాఫ్ ఆ ఏరియా మొత్తాన్ని ఖాళీ చేయించి, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పాముని పట్టుకుని తీసుకెళ్లారు. పాము విమానంలోకి ఎలా దూరిందనే విషయమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..