పాల వ్యాపారుల్లో కలవరం.. పశువులు దుర్మరణం..

  0
  37

  ఆవులు, గేదెలతో పాల డెయిరీ నిర్వహిస్తున్న పంజాబ్ వ్యాపారుల్లో కలవరం మొదలైంది. లూధియానా జిల్లాలోని బెర్ కలాన్ గ్రామంలో.. ఉన్నట్టుండి వింత వ్యాధి ప్రబలింది. ఆవులు, గేదెలు ఒకదాని వెంట ఒకటి మృత్యువాద పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 13 ఆవులు ఈ వ్యాధికి బలయ్యాయి. ఇటీవల కాలంలో ఏకంగా 60పశువులు మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 500 పశువులకు ఈ లక్షణాలు కనపడటంతో పశు వైద్యులు అక్కడికి వచ్చి దానిపై అధ్యయనం చేశారు. అది ఫుట్ అండ్ మౌత్ వ్యాధిగా గుర్తించారు. సమీపంలోని అన్ని డెయిరీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి, పశువులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోని పశువుల యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

  ఇవీ చదవండి..

  ఊపిరి తిత్తులు చెప్పే వాక్సిన్ అసలు రహస్యం..

  బ్లూటూత్ పేల‌డం ఎప్పుడైనా విన్నారా ?

  ఒలింపిక్ విజేత మీరాబాయి కన్నీళ్లతోఇలా..

  శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ అక్క జాన్వీకి పోటీ వస్తోంది..