ఆ అమ్మాయి చేతిలో నాగుపాము ఆటబొమ్మే ..

  0
  54

  ఒక యువతి ఒట్టి చేత్తో కింగ్ కోబ్రాను ప‌ట్టుకుంది. ఓ బిల్డింగ్‌లోకి దూరిన ఆ భారీ సర్పాన్ని ఆమె అత్యంత లాఘవంగా పట్టుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
  వాయిస్ :
  పాములు ప‌ట్ట‌డ‌మంటే ఆషామాషీ కాదు. ఎంతో నైపుణ్యం ఉంటేగానీ ప‌ట్టుకోలేరు. ఆద‌మ‌రిచామంటే ఒక్క కాటుకి కాటికి వెళ్ళాల్సిందే. అయితే ఓ యువ‌తి మాత్రం కింగ్ కోబ్రాను ఎంతో చాక‌చక్యంగా ప‌ట్టుకోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఆ పామును పట్టుకునేందుకు ఆ యువతి ఎలాంటి ఆయుధాలను వాడలేదు. ఒంటి చేత్తో ప‌ట్టుకుంది. పాము కాటేయడానికి చాలాసార్లు ప్రయత్నించినా, ఆమె సునాయాసంగా తప్పించుకుంది. అనంతరం దానిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద వదలిపెట్టింది. మళ్లీ ఆ పాము బిల్డింగ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా.. మళ్లీ పట్టుకుని దూరంగా వదిలేసింది. ఆ యువతి ధైర్యానికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?